చైతన్య, సాయి పల్లవి ల ‘లవ్ స్టోరీ’ నుండి ‘ఏయ్ పిల్లా’ ఫుల్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే….!!

 119 total views,  1 views today

క్లాస్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా సినిమా లవ్ స్టోరీ. హృద్యమైన ప్రేమకథగా పలు రొమాంటిక్, ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాని దర్శకుడు శేఖర్ తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ వగల టాక్. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ఏయ్ పిల్లా సాంగ్ ప్రోమో కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడం జరిగింది.

ఇక ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో ని ఈనెల 11వ తేదీన సాయంత్రం 4 గంటల 5నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్, తో పాటు ఏమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి తొట్ట తొలిగా నటిస్తున్న చైతు, సాయి పల్లవిల జంట స్క్రీన్ పై ఎలా ఉంటుందో చూడాలి….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *