ప్రభాస్ సినిమా ఎలా ఉండబోతోందో చెప్పిన డైరెక్టర్ నాగ అశ్విన్….!!

 173 total views,  1 views today

ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ప్రభాస్, తన తదుపరి సినిమాని నిన్న ప్రకటించడం జరిగింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు చిత్ర సీమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ నెక్స్ట్ మూవీ ని నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నిన్న ప్రకటించడం జరిగింది. గతంలో ఇదే బ్యానర్ పై కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మహానటి వంటి గొప్ప సినిమాని తీసిన అశ్విన్, 

ప్రభాస్ తో ఎటువంటి సినిమా చేస్తారో అని అందరూ ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటుండగా, నిన్న అశ్విన్ దీనికి సంబంధించి ఒక ఆసక్తికర ట్వీట్ చేసారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా మొదలై, వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయడం జరుగుతుందని, అలానే అందరూ అనుకుంటున్నట్లు ఇది పాన్ ఇండియా సినిమా కాదు, అంతకు మించి పాన్ వరల్డ్ సినిమా అంటూ అశ్విన్ తన ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ చేస్తూ తెలిపారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *