మై డియర్ బచ్చా…. మా అమ్మ దగ్గర నీ బట్టర్ ఉడకదురా : మెగాస్టార్ చిరంజీవి…..!!

 152 total views,  1 views today

ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో దేశం మొత్తం కూడా లాక్ డౌన్ అమలవుతుండడంతో అన్ని రంగాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అలానే సినిమా షూటింగ్స్ కూడా పూర్తి నిలిచిపోవడంతో నటీనటులు తమ ఇళ్లలోనే ఉంటున్నారు .ఇక గత కొద్దిరోజుల క్రితం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అకౌంట్స్ ఓపెన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, ఎప్పటికపుడు పలు పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ ని ఉత్తేజపరుస్తున్నారు.

Chiranjeevi was jealous of his son Ram Charan because of THIS reason

ఇకపోతే నిన్న ఆయన కొడుకు రామ్ చరణ్, తన తల్లి సురేఖ, అలానే నానమ్మ అంజనా దేవిల దగ్గర వెన్న తీసే టెక్నీక్ ని నేర్చుకుంటూ ఒక వీడియో పోస్ట్ చేయగా, దానిని కాసేపటి క్రితం ట్యాగ్ చేసిన మెగాస్టార్, ‘మై డియర్ బచ్చా …మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్ ‘ ఉడకదురా. ఫస్ట్  ప్లేస్ ఎప్పుడు నాదే’. నువ్వు ఎంత బటర్ వేసినా నీ పొజిషన్ మాత్రం బెటర్ అవ్వదు. కాకపోతే, అదే గ్యారెంటీ నాకు మీ అమ్మ దగ్గర లేదనుకో అంటూ కొంత సరదాగా రీట్వీట్ చేయడం జరిగింది….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *