పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్…..!!

 301 total views,  1 views today

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంతో గొప్ప విజయాన్ని అందుకుని అప్పట్లో పెద్ద రికార్డ్స్ ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత మరొక్కసారి వారిద్దరూ కలిసి మరొక సినిమా చేద్దాం అనుకున్నప్పటికీ అది కుదరలేదు. ఇకపోతే అతి త్వరలో వారిద్దరూ కలిసి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు,

 

అలానే ఇటీవల ఆ సినిమాకు సంబండఁచిన అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. ఇకపోతే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ని తీసుకుంటున్నట్లు నిన్న హరీష్ శంకర్ నిన్న తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వెల్లడించారు. దీనితో మరొక్కసారి గబ్బర్ సింగ్ కాంబోలో రాబోతున్న వీరు, ఏ రేంజ్ లో అదరగొడతారో చూడాలి. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది…..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *