181 total views, 1 views today
ప్రస్తుతం కరోనా మహమ్మారిని అరికట్టడానికి ఇప్పటికే పలు దేశాలు తమ ఎక్కడి ప్రజలు అక్కడే పూర్తిగా తమ ఇళ్లకు పరిమితం చేస్తూ లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా మన దేశాన్ని ఈనెల 14వరకు మొత్తం 21 రోజులు లాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ కరోనా ని అత్యంత త్వరగా తరిమికొట్టడానికి ప్రజల మధ్య సామాజిక దూరం పెంచడం ఒక్కటే మార్గం అని భావించిన పలు దేశాలు ఈ విధంగా వ్యహరించాయి. ఇక ఈ కరోనా అసలు ఎందుకు వచ్చింది అనే దానిపై నిన్న ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ లో టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సంచలన కామెంట్స్ చేసారు.
నిజానికి ప్రపంచానికి ఇటువంటి విపత్తు ఇంతకుముందెన్నడూ రాలేదని,అయితే రాను రాను మనిషిలో పెరిగిపోతున్న స్వార్ధ చింతన, అహంకారం, పదవీ వ్యామోహం, కుల జాడ్యం వంటి వాటి వల్లనే మహమ్మారి కరోనా వంటివి మనకు వస్తున్నాయని, మనిషి మనిషిగా బ్రతికి ప్రక్కన ఉన్నవారిని కూడా మానవత్వంతో చూస్తే తప్పకుండా ఆ దేవుడి దయ మన మీద ఉంది ఇటువంటి విపత్తులు రాకుండా ఉంటాయని అన్నారు. అందుకని ఇప్పటికైనా మన సమాజంలో అహంకారం, ఈర్ష్య, ద్వేషాలు కలిగిన వారు, తమ మనసు మార్చుకుని మంచిగా వ్యవహరిస్తే తప్పకుండా మనకు అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని మోహన్ బాబు అన్నారు…..!!