కరోనాని ఎదుర్కోవడానికి మోహన్ బాబు చేసిన సూచనలు ఏంటంటే…. ??

 163 total views,  1 views today

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలను కరోనా మహమ్మారి విపరీతంగా భయబ్రాంతులకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిని మరింతగా ప్రబలకుండా ఉండేలా ఇప్పటికే మన దేశాన్ని ఏకంగా 21 రోజుల పాటు పూర్తిగా లాకౌట్ చేస్తున్నట్లు ఇటీవల మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అలానే ప్రజలు తమ ఇళ్లకే పూర్తిగా పరిమితం అయి సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రధాని సహా పలువురు మంత్రులు, అధికారులు, ప్రముఖులు కోరుతున్నారు. ఇక నేడు టాలీవుడ్ కలెక్షన్ కింగ్ నటప్రపూర్ణ మోహన్ బాబు ఒక వీడియో బైట్ ద్వారా కరోనా మహమ్మారిని ఎదుర్కోవానికి తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు.

 

ప్రస్తుతం ఈ మహమ్మారి వలన దేశ దేశాలు అన్ని కూడా పూర్తిగా సమస్యల్లో ఇరుక్కున్నాయని, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మన దేశాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రధాని చెప్పిన విధంగా చేయాలనీ కోరారు. షేక్ హాండ్స్ కాకుండా నమస్కారం పెట్టాలని, అలానే పూర్తిగా ఇంటికే పరిమితం అవడంతో పాటు ఎప్పటికప్పుడు 20 సెకండ్స్ పాటు చేతులను శుభ్రం చేసుకుని, మన ప్రక్కింటి వారికి కూడా దూరంగా ఉండి, ఈ కొద్దిరోజుల పాటు ఇటువంటి కఠిన నియమాలు పాటిస్తే కరోనా తప్పకుండా మన దేశం నుండి తరిమివేయబడుతుందని మోహన్ బాబు అన్నారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *