సూర్య ‘ఆకాశం నీహద్దురా’ మూవీలో మోహన్ బాబు లుక్ అదిరిందిగా….!!

 130 total views,  1 views today

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఆకాశం నీహద్దురా. సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం కల్పించాలనే సదుద్దేశంతో ఎయిర్ డక్కన్ సంస్థని ప్రారంభించిన కెప్టెన్ గోపినాథ్ జీవిత గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకురాలు సుధా. గతంలో ఆమె విక్టరీ వెంకటేష్ హీరోగా గురు సినిమాని తీసి మంచి హిట్ కొట్టారు. 

ఇకపోతే ఈ సినిమాలో నటప్రపూర్ణ మంచు మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే నేడు భక్తవత్సలం నాయుడు పాత్ర పోషిస్తున్న ఆయన అఫీషియల్ లుక్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇక సీనియర్ పైలట్ గా ఆ లుక్ లో మోహన్ బాబు అదిరిపోయాడు అనే చెప్పాలి. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అలానే సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *