172 total views, 1 views today
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి, దాని అనంతరం చేయబోయే ఇద్దరు దర్శకులు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు నేడు ఫిలిం నగర్ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి. ముందుగా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రేమేక్ ని సాహో సినిమా దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో చేయనున్నారట మెగాస్టార్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మించనున్నారు.
దాని తరువాత జై లవకుశ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ లో మెగాస్టార్ నటించనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లోని ఒక బడా నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో మెగాస్టార్ క్యారెక్టర్ అదిరిపోనుందని, అలానే తప్పకుండా సినిమా కూడా మంచి హిట్ అందుకుంటుందని సమాచారం. కాగా మరికొద్దిరోజుల్లో ఈ రెండు సినిమాలకు సంబందించిన అధికారిక ప్రకటనలు వెలువడనున్నట్లు తెలుస్తోంది…..!!