160 total views, 1 views today
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న 152వ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా త్రిష నటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇకపోతే ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక విద్యార్థి నాయకుడిగా నటించనున్నారని, సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఆయన పాత్ర, మొత్తం అరగంట పాటు ఉందని అంటున్నారు.
అయితే ముందుగా ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ అని ఫిక్స్ చేసినట్లు ఇటీవల ఓ పిట్ట కథ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దానిని అనుకోకుండా రివీల్ చేసారు మెగాస్టార్. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాకు ‘సిద్దార్ధ ఆచార్య’ అనే టైటిల్ ని అనుకుంటున్నారని, ఎందుకంటే సినిమాలో మహేష్ పేరు సిద్దార్ధ అని, అందుకే చిరు, మహేష్ క్యారెక్టర్ల పేరు వచ్చేలా దర్శకుడు కొరటాల టైటిల్ లో కొంత మార్పు చేయిస్తున్నట్లు చెప్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది…..!!