మెగాస్టార్ కి కరోనా కాదట…. మ్యాటర్ ఏంటంటే ….??

 138 total views,  10 views today

టాలీవుడ్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా పాజిటివ్ బారిన పడ్డట్లు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రేక్షకులు, అభిమానులకు తెలిపారు. దానితో ఒక్కసారిగా అందరికీ ఎంతో ఆశ్చర్యం వేసింది. నిజానికి తనకు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవని, అయితే మరుసటి రోజు ఆచార్య షూటింగ్ మొదలు కానుండడంతో తాను కరోనా టెస్ట్ చేయించుకున్నానని మెగాస్టార్ అన్నారు.

అయితే అప్పటి నుండి మూడు రోజుల పాటు పలువురు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్న తనకు అప్పటికీ కూడా ఎటువంటి లక్షణాలు కనపడలేదని, అయితే ఎట్టకేలకు రెండు ప్రముఖ ఆసుపత్రుల వైద్యులను సంప్రదించి రెండు చోట్ల విడివిడిగా టెస్ట్ చేయించుకోగా నెగటివ్ అని రిపోర్ట్ వచ్చిందని, దానితో తనతో పాటు ఫ్యామిలీ మొత్తం కూడా ఊపిరి పీల్చుకున్నాం అని నిన్న మరొక పోస్ట్ ద్వారా మెగాస్టార్ తెలిపారు. ఇక తనకు కరోనా సోకింది అని తెలియగానే తనపై ఎనలేని ప్రేమ కురిపించి తాను కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్ …..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *