బాహుబలి రేంజ్ లో మోహన్ లాల్ ‘మరక్కార్’ ట్రైలర్…. చూస్తే మతిపోవడం ఖాయం….!!

 131 total views,  1 views today

ప్రముఖ మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ హీరోగా ప్రియదర్శన్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మరక్కార్’. అరేబియన్ సముద్రపు సింహం ట్యాగ్ లైన్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ ఖర్చుతో నిర్మితం అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి తన చితులమీదుగా ఆవిష్కరించారు. మలయాళంలో ఎంతో భారీ ఎత్తున తెరకెక్కిన ఈ సినిమాలో సుహాసిని, సునీల్ శెట్టి, ప్రభు,

జై, మంజు వారియర్, కళ్యాణి ప్రియదర్శన్, సీనియర్ నటుడు అర్జున్ సహా మరికొందరు దిగ్గజ నటులు నటించడం జరిగింది. అదిరిపోయే విజువల్స్, యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలతో ఎంతో అత్యద్భుతంగా ఈ ట్రైలర్ రూపొందింది. ఒక్కమాటలో చెప్పాలంటే మన తెలుగు సూపర్ హిట్ మూవీ బాహుబలి రేంజ్ లో ఉన్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. కాగా ఉగాది పండుగ సందర్భంగా ఈనెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *