డ్యాన్స్ తో నాకున్న అనుభవం అటువంటిది : మెగాస్టార్ చిరంజీవి……!!

 117 total views,  1 views today

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ముఖ్యంగా మనకు ఎంతో నచ్చేవి ఆయన డ్యాన్సులు అనే విషయం తెలిసిందే. ఆయన టొప్పు నటులో అంతే గొప్ప డ్యాన్సర్ కూడా. ఇక ఆయన వేసే డ్యాన్స్ లకు ఫిదా కానీ ప్రేక్షకుకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా ఇంట్లోనే ఉంటున్న మెగాస్టార్, నేడు ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ని పురస్కరించుకుని ఒక వీడియో పోస్ట్ చేసారు.

 


తనకు డ్యాన్స్ తో ఎంతో మంచి అనుబంధం ఉందని, దానివలన తనకు ఎందరో అభిమానులు లభించారని చెప్పిన మెగాస్టార్, తన మాదిరిగానే మీరు అందరూ కూడా మీకు ఎప్పుడైనా మానసిక ఒత్తిడి కలిగినపుడు మంచి సాంగ్ పెట్టుకుని దానికి డ్యాన్స్ చేయండి వెంటనే మీకు మంచి రిలీఫ్ కలుగుతుందని చెప్పిన మెగాస్టార్, నేటి సాయంత్రం 6 గంటలకు తన సినిమాల్లోని కొన్ని ప్రత్యేక డ్యాన్స్ మూమెంట్స్ తో కూడిన ఒక వీడియో పోస్ట్ చేస్తానని చెప్పడం జరిగింది …..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *