వారందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు : మెగాస్టార్ చిరంజీవి….!!

 139 total views,  1 views today

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలను కుదిపేస్తున్న కరోనా వ్యాధి వలన దాదాపుగా చాలా దేశాలు పూర్తిగా కొన్ని వారాలపాటు లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మన దేశాన్ని కూడా ఏప్రిల్ 15 వరకు మొత్తం 21 రోజులపాటు లాకౌట్ చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడం జరిగింది. అయితే దీనివలన పనులు లేక దిగువ తరగతులవారికి ఉపాధిని కోల్పోయి తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఎదుర్కోవలసి రావడంతో పలువురు ప్రముఖులు మేమున్నాం అంటూ తమవంతుగా ఆర్ధిక సాయాన్ని అందిస్తూ ముందుకు వస్తున్నారు.

 

megastar chiranjeevi

అందులోభాగంగా టాలీవుడ్ నుండి ఇప్పటికే చాలామంది విరాళాలు ఇవ్వగా, నేడు విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, శర్వానంద్, రవితేజ, లావణ్య, శ్రీవేంకటేశ్వ సినీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలు తమవంతుగా అధిక సాయాన్ని అందించడంతో మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ఆ పోస్ట్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *