మెగాస్టార్ మెగా సెన్సేషన్ ‘సైరా’ కు ఏడాది ….. !!

 258 total views,  1 views today

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సైరా నరసింహారెడ్డి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబడిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తొలి తరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు.

Sye Raa Narasimha Reddy Movie Review , Rating , Public Talk

బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది అందించిన సాంగ్స్ అలానే జూలియస్ పకీయం అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అదరగొట్టే విజువల్స్ ని తీసిన రత్నవేలు ఫోటోగ్రఫి ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తమన్నా ఒక ముఖ్య పాత్రలో నటించింది. రిలీజ్ అనంతరం మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా రిలీజ్ అయి నేటికీ సక్సెస్ఫుల్ గా ఏడాది గడవడంతో పలువురు మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులు, సైరా నరసింహారెడ్డి మూవీ యూనిట్ కి తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు …..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *