వారికి ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నాను : మెగాస్టార్ చిరంజీవి…..!!

 126 total views,  1 views today

కరోనా మహమ్మారి వలన మన దేశాన్ని కూడా ఇతర దేశాల మాదిరిగా మొత్తంగా 21 రోజుల పాటు లాకౌట్ చేస్తున్నట్లు ఇటీవల మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ లాకౌట్ సమయంలో ప్రజల ఆరోగ్య రక్షణ కోసం నిరంతరం ఎంతో శ్రమిస్తున్న పోలీసులపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే పోలీసు వారిపై సూపర్ స్టార్ మహేష్ పొగడ్తలు కురిపించగా, నేడు మెగాస్టార్ చిరజీవి తన ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేసారు.

 


ఇటువంటి విపత్కర సమయంలో మన రక్షణ బాధ్యత కోసం తమ కుటుంబాలను కూడా విడిచిపెట్టి, నిరంతరం ఎంతో కష్టపడుతున్న పోలీసు వారికి, అలానే మన రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల తో పాటు హైదరాబాద్ పోలీసులకు కూడా ఒక పోలీస్ బిడ్డగా సెల్యూట్ చేస్తున్నాను, జైహింద్ అంటూ మెగాస్టార్ తన వీడియో బైట్ లో తెలిపారు……!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *