ఆ మహిళా పోలీస్ కి సెల్యూట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి…. మ్యాటర్ ఏంటంటే…..??

 495 total views,  2 views today

గత కొద్దివారాలుగా కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో మన దేశం మొత్తం కూడా లాక్ డౌన్ లో ఉండిపోవడంతో డాక్టర్లు, శానిటరీ సిబ్బందితో పాటు ఎందరో పోలీసులు తమ ప్రాణాలొడ్డి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. కాగా రెండు రోజుల క్రితం ఒడిశా రాష్ట్రానికి చెందిన శుభశ్రీ అనే లేడీ పోలిసి అధికారిణి, రోడ్డు పై వెళ్తుండగా అక్కడ ఆకలితో అలమటిస్తున్న ఒక మానసిక దివ్యంగురాలిని చూసి చలించిపోయి, ఆమెకు అన్నం అందివ్వడంతో పాటు తన చేతితో స్వయంగా ఆమెకు తినిపించడం జరిగింది.

 

కాగా ఆ వీడియో రెండు రోజులుగా ఇంటర్నెట్ లో ఎంతో వైరల్ అయింది. ఆ వీడియో చూసి చలించిపోయిన మెగాస్టార్ చిరంజీవి, అనంతరం ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడి, ఆమె చేసిన ఆ గొప్పపనికి సెల్యూట్ చెప్పారు. అయితే మెగాస్టార్ గా మీరు కూడా చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి విన్నానని చెప్పిన పోలీసు అధికారిని శుభశ్రీ, తాము పోలీసులం మాత్రమే కాదని, అవసరం అయితే ప్రజలకు తమవంతుగా ఎటువంటి సేవలు అయినా అందించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. కాగా ఆమెతో మాట్లాడిన వీడియోని మెగాస్టార్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు….!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *