ఆంజనేయస్వామితో నా అనుబంధం అంత గొప్పది : మెగాస్టార్ చిరు….!!

 137 total views,  1 views today

టాలీవుడ్ నటుడు మెగాస్టార్ చిరంజీవి నేడు హనుమజ్జయంతి సందర్భంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పెట్టిన పోస్టులు ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతున్నాయి. నాకు, ఏప్రిల్ 8కి విడదీయ రాని అనుబంధం ఉంది అంటూ ఇటీవల మెగాస్టార్ ఒక ఆసక్తికర ట్వీట్ చేసారు.

 

నాకు 1962లో ఒక లాటరీలో వచ్చిన ఆంజనేయస్వామి బొమ్మ ఇప్పటికీ కూడా నాదగ్గర అలానే భద్రంగా ఉంది, అప్పుడు ఆ బొమ్మని చూసిన నాన్న గారు, ఆచం ఆంజనేయుడి మాదిరిగానే  ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు  అలానే ఉన్నాయి అన్నారు అంటూ తన చిన్నప్పటి ఫోటో ని పోస్ట్ చేసారు మెగాస్టార్. కొన్నేళ్ల క్రితం బాపు గారు ఆంజనేయ స్వామి బొమ్మని గీస్తే కొంత మిమ్మల్ని చూసినట్లే ఉంది అని చెప్పారు, బహుశా ఆయన రూపం కొంతవరకు నాకు వచ్చి ఉండడం నిజంగా నా అదృష్టం అని మెగాస్టార్ పోస్ట్ చేసారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *