మథర్స్ డే రోజున తన పోస్ట్ తో అందరినీ కదిలించిన మెగాస్టార్…..!!!

 166 total views,  1 views today

ఇటీవల సోషల్ మీడియా మాధ్యమాల్లో జాయిన్ అయిన మెగాస్టార్ చిరంజీవి పలు అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత అభిప్రాయాలను వాటి ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే నేడు మథర్స్ డే సందర్భంగా మెగాస్టార్ పోస్ట్ చేసిన ఒక వీడియో పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో ఒకరితో మరొకరు మాట్లాడాలన్నా,

 

లేదా ప్రక్కవారిని ముట్టుకోవాలన్న ఎంతో భయపడుతున్నారని, అయినప్పటికీ కూడా నిన్న ఒక మహిళా ఎస్సై తన గొప్ప మనసుతో ఒక వృద్ధురాలికి ఆప్యాయంగా అన్నం తినిపిస్తున్న వీడియో తనని ఎంతో కదిలించిందని, అది చూసిన తరువాత ఆ మహిళా ఎస్సై వివరాలు కనుక్కుని, ఆమెతో తాను ప్రత్యేకంగా సంభాషించానని, కాగా ఆ వీడియో ని కొద్దిసేపటి తరువాత పోస్ట్ చేస్తానని మెగాస్టార్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *