మిత్రమా, మహమ్మారి తాత్కాలికం…. కానీ, మన స్నేహం శాశ్వతం…..!!

 320 total views,  1 views today

టాలీవుడ్ స్టార్ నటులైన మెగాస్టార్ చిరంజీవి, నటప్రపూర్ణ మోహన్ బాబు ఇద్దరి మధ్యన మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. అలానే ఈ ఇద్దరూ బయట ఎక్కడైనా కలిసిన సందర్భాల్లో ఎంతో సరదాగా ఉంటూ ఒకరిపై మరొకరు ఛలోక్తులు విసురుకుంటూ ఉంటారు. ఇకపోతే ఇటీవల సోషల్ మీడియా మాధ్యమాలకు ఉగాది రోజున ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ కు వెల్కమ్ మిత్రమా అని మోహన్ బాబు ట్వీట్ చేయడం, దానికి రాననుకున్నావా రాలేననుకున్నావా అంటూ మెగాస్టార్ బదులివ్వడం జరిగింది.

chiru mohanbabu

 

అయితే ఆ తరువాత దానికి సమాధానం ఇచ్చిన మోహన్ బాబు, ఈసారి నిన్ను కౌగిలించుకున్నపుడు చెప్తాను మిత్రమా అంటూ ఒక ట్వీట్ చేయగా, మనం మన సంస్కృతి సంప్రదాయాలను పాటించి ఇకపై కౌగిలించుకోవడం, కరచాలనం చేయడం వంటివి మానుకుని హాయిగా ఒకరికి మరొకరు నమస్కరించుకుందాం అన్నారు. అలానే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అవి తప్పక పాటించాలని, ఇటీవల కరోనా జాగ్రత్తలపై లక్ష్మి ప్రసన్న పోస్ట్ చేసిన వీడియో చూడు అంటూ పోస్ట్ చేయగా, కరోనా మహమ్మారి అనేది తాత్కాలికం, కానీ మన స్నేహం మాత్రం శాశ్వతం అంటూ మోహన్ బాబు మెగాస్టార్ ట్వీట్ ని రీట్వీట్ చేయడం జరిగింది.. ఇక ప్రస్తుతం వారిద్దరి సరదా ట్వీట్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *