కోడలు ఉపాసనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పిన మెగాస్టార్ చిరు….!!

 112 total views,  1 views today

ప్రస్తుతం మహమ్మారి కరోనా వైరస్ కారణంగా దేశ దేశాలు అన్ని కూడా ఎంతో వణికిపోతున్నాయి. అయితే ఈ వ్యాధిని మరింతగా అరికట్టేందుకు మన దేశం సహా పలు ఇతర దేశాలు కూడా పూర్తిగా ప్రజలను తమ తమ ఇళ్లకు పరిమితం చేసి లాకౌట్ ప్రకటించాయి. అయితే దీని వలన పలువురు దిగువ వర్గాల ప్రజలు పనులు లేక, తినడానికి సరిగ్గా తిండి కూడా లేక నానా యత్నాలు అనుభవిస్తుండడంతో సినిమా పరిశ్రమ అటువంటి వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తోంది.

 

 

ఇక ఇటీవల పలువురు సినిమా నటులు సైతం వారిని ఆదుకోవడానికి తమకు వీలైనంత ఆర్ధిక సాయాన్ని కూడా అందించారు. ఇక నేడు కాసేపటి క్రితం డైలీ వర్కర్ల ఆరోగ్యం కోసం ఫ్రీగా మందులను అందించడానికి తమ అపోలో హాస్పిటల్ తరపున ముందుకు వచ్చిన తన కోడలు కొణిదెల ఉపాసనకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కృతజ్ఞతలు తెలిపారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *