మానవరాలితో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి……!!

 132 total views,  1 views today

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అన్ని కూడా బంద్ కావడంతో కొద్దిరోజులుగా తన కుటుంబసభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఇటీవల ఉగాది పండుగ నాడు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అకౌంట్స్ ఓపెన్ చేసిన మెగాస్టార్, వాటి ద్వారా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను ప్రేక్షకులు, అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే నేడు తన మానవరాలితో కలిసి తాను నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాలోనే ‘మిమ్మి మిమ్మిమ్మి’ సాంగ్ వింటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్న వీడియో ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

 

ఒకప్పుడు తాము పాటలు వింటూ దానికి తగ్గట్టుగా డాన్స్ చేసేవాళ్ళం అని మెగాస్టార్ చెప్పారు. తన మనవరాలు తన సినిమాలోని మిమ్మి మిమ్మిమ్మి సాంగ్ ని ఎంతో ఇష్టపడతూ కొంత కేరింతలు కొట్టడం, అలానే మధ్యలో పాటని ఆపేయగానే మళ్ళి ఆ పాట పెట్టమని గొడవ చేయడం వీడియోలో గమనించవచ్చు. ఒక ఏడాది పాప అయినప్పటికి కూడా నాతో, వాళ్ళ అమ్మమ్మ సురేఖతో పాప ఎంతో బాగా గడుపుతోందని మెగాస్టార్ తన పోస్ట్ లో తెలిపారు……!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *