132 total views, 1 views today
ప్రస్తుతము కరోనా మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం కూడా లాక్ డౌన్ అమలవుతుండడంతో, సినిమా షూటింగ్స్ కూడా నిలిపివేయబడడంతో నట నటులు కూడా ఎవరి ఇళ్లలో వారు ఉండిపోవడం జరిగింది. అయితే మధ్యలో కొందరు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తమ వ్యక్తిగత విషయాలను అభిమానులు, ప్రేక్షకులంతా పంచుకున్నారు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, తమ్ముడిగా పవన్ అంటే తనకు ఎప్పటికీ ప్రేమాభిమానాలు ఉంటాయని,
అప్పుడప్పుడు తాను ఇంటికి వచ్చినపుడు ఇంట్లో అందరం కలిసి సరదాగా మాట్లాడుకుని భోజనం చేస్తుంటాము అని చెప్పిన చిరంజీవి, పవన్ రాజకీయ జీవితంలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని అన్నారు. వాస్తవానికి గతంలో తాను ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు, ఆ పార్టీలో జరిగిన మోసాలు, కుట్రలు స్వయంగా చూసి కొంత ఆవేదన చెందిన పవన్, ఇటీవల కావాలనే తానే స్వయంగా జనసేన పార్టీ స్థాపించడం మంచి విషయం అని, పవన్ కు అభ్యుదయ భావాలు ఎక్కువని చెప్పిన చిరంజీవి, రాజకీయాల పరంగా తామిద్దరం వేరు వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా తామిద్దరి గమ్యం, ఆలోచనలు మాత్రం ఒక్కటే అని అన్నారు మెగాస్టార్…..!!