170 total views, 1 views today
టాలీవుడ్ లో దాదాపుగా 150 సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకరత్న దాసరి నారాయణరావు గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దర్శకుడిగా తొలి సినిమా ‘తాత మనవడు’ నుండి చివరి సినిమా ఎర్ర బస్సు వరకు ఆయన ప్రతిభ నుండి జాలువారిన ఆణిముత్యాల్లాంటి గొప్ప గొప్ప సినిమాలు ఎన్నో ఉన్నాయి. మూడేళ్ళ క్రితం ఆయన మనల్ని విడిచి అనంతలోకాలకేగినప్పటికీ ఆయన మన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మిగిల్చిన స్మృతులు ఎప్పటికీ చెరిగిపోవు అనే చెప్పాలి.
దా..దానంలో కర్ణుడుమీరు
స..సమర్ధతలో అర్జునుడుమీరు
రి..రిపువర్గమేలేని ధర్మరాజుమీరు
మీరు మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే వుంటుంది.
ప్రతీ భావిదర్శకుడి జీవితానికి మార్గదర్శకమవుతుంది.
This was my last memory of Guruvu garu.We miss u Sir #LastPressmeet #Dasari pic.twitter.com/XBOUmIqLyW
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 4, 2020
ఇక నేడు ఆయన జయంతిని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా దాసరిని స్మరిస్తూ ఒక పోస్ట్ చేసారు. ‘దా..దానంలో కర్ణుడుమీరు, స..సమర్ధతలో అర్జునుడుమీరు, రి..రిపువర్గమేలేని ధర్మరాజుమీరు. అంటూ దాసరి పేరులోని మూడక్షరాలకు గొప్ప అర్ధాన్నిచ్చారు మెగాస్టార్. మీరు మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే వుంటుంది. ప్రతీ భావిదర్శకుడి జీవితానికి మార్గదర్శకమవుతుంది అంటూ మెగాస్టార్ పెట్టిన ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది…..!!