‘ఆచార్య’ లో మహేష్ ఉన్నారా……లేరా.??…..క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ చిరు….!!

 153 total views,  2 views today

ప్రస్తుతం వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య లో నటిస్తున్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా లాకౌట్ నేపథ్యంలో ఆగిపోయింది. అయితే ఈ సినిమా గురించిన సంగతులను నేడు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మెగాస్టార్ వెల్లడించారు. దర్శకుడు కొరటాల మంచి విజన్ ఉన్న దర్శకుడని, తప్పకుండా మా ఇద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా మంచి హిట్ కొడుతుందని నమ్మకాన్ని వెలిబుచ్చారు మెగాస్టార్.

Chiranjeevi -Sitara for Mahesh Babu

ఇక ఈ సినిమాలో మహేష్ నటిస్తున్నారన్నది పూర్తిగా అవాస్తవం అని, అసలు ఆ పుకారు ఎలా వచ్చిందో తనకు ఇప్పటికీ అర్ధం కావడం లేదని అన్నారు. మహేష్ తనకు బిడ్డలాంటి వాడని, అతడితో నటించాలని తనకి కూడా ఎప్పటినుండో ఉందని, అయితే ఈ సినిమాలో మాత్రం ఆయన నటిస్తున్నారన్నది అవాస్తవం అని మెగాస్టార్ తేల్చి చెప్పారు. అలానే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం రామ్ చరణ్ ని తీసుకుందాం అని భావించినప్పటికీ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉండడంతో చరణ్ ఎంతవరకు ఆ క్యారెక్టర్ చేస్తాడు అనేది మరికొద్దిరోజుల్లో వెల్లడి కానుందని అన్నారు మెగాస్టార్…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *