168 total views, 1 views today
ప్రస్తుతం వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి, నేడు ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, ఆచార్య ఎంతో బాగా వస్తోందని, అన్ని రకాల కమర్షియల్ హంగులతో పాటు మంచి సామజిక మెసేజ్ ని జోడించి దర్శకుడు శివ ఆ సినిమాని ఎంతో గొప్పగా తీస్తున్నారని అన్నారు.
ఇక దాని తరువాత మలయాళ హిట్ చిత్రం ‘లూసిఫర్’ సినిమాని సాహో దర్శకుడు సుజీత్ తో చేసే అవకాశం ఉందని, ఇటీవల వెంకీ మామ సినిమా దర్శకుడు బాబీ ఒక అద్భుతమైన స్టోరీ వినిపించారని దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, అలానే శక్తి సినిమా దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నట్లు చెప్పిన మెగాస్టార్, కొన్నాళ్ల క్రితం యువ దర్శకులైన పరశురామ్, హరీష్ శంకర్, సుకుమార్ వంటి వారు తనని కలిసారని, మంచి కథ దొరికితే ప్రస్తుత యువ దర్శకులతో పని చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధం అని మెగాస్టార్ అన్నారు…..!!