392 total views, 1 views today
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. ఇటీవల ఓ పిట్ట కథ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ప్రత్యేకంగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, మాటల సందర్భంలో సినిమా టైటిల్ ని అనుకోకుండా రివీల్ చేయడం జరిగింది. ఇక కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈ నెల 25వ తేదీన ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు టాక్. తెలుగు సంవత్సరాదిగా చెప్పబడే ఉగాది రోజున ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, ఆపై సినిమాని స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తుండగా, ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తుండడంతో దాని గురించి కూడా ఉగాది సందర్భంగా అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. మరి అదే కనుక నిజం అయితే మెగాస్టార్, సూపర్ స్టార్ లను ఒకే తెరపై చూసి పండుగ చేసుకోవచ్చన్నమాట…..!!