143 total views, 1 views today
ప్రస్తుతం డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యద్భుత చిత్ర రాజం రౌద్రం రణం రుధిరం. ఇక ఈ సినిమా ఇప్పటికే ఎనభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోవడం జరిగిందని ఇటీవల దర్శకుడు రాజమౌళి వెల్లడించడం జరిగింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో అల్లూరి పాత్ర కోసం కొంత శారీరక శ్రమ చేస్తున్న రామ్ చరణ్, ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా బాక్సింగ్ లో కొందరు నిపుణుల దగ్గర శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా నేడు ఉదయం నుండి రామ్ చరణ్ బాక్సింగ్ నేర్చుకుంటున్న ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి…..!!