‘అహం బ్రహ్మాస్మి’ మూవీ లాంచ్ చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్…..!!

 121 total views,  1 views today

మంచు మనోజ్ స్థాపించిన ఎమ్ఎమ్ ఆర్ట్స్ బ్యానర్ పై ఆయన హీరోగా రూపొందనున్న ‘అహంబ్రహ్మాస్మి’ సినిమా ప్రారంభోత్సవం నేడు హైదరాబాద్ లో ఎంతో వైభవముగా జరిగింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన ఈ వేడుకలో మంచు మోహన్ బాబు దంపతులతో పాటు మరికొందరు సినిమా ప్రముఖులు సందడి చేయడం జరిగింది.

శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియా భవాని శంకర్ నటిస్తుండగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ముందుగా సినిమాని క్లాప్ కొట్టి రామ్ చరణ్ ప్రారంభించగా, మెగా డాటర్ సుస్మిత, మంచు లక్ష్మి ప్రసన్న కలిసి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *