ట్విట్టర్ లో సంచలన రికార్డు నమోదు చేసిన ‘సాయి ధరమ్ తేజ్’….!!

 421 total views,  1 views today

పిల్ల నువ్వు లేని జీవితం ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగాసూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, ఫస్ట్ సినిమాతో మంచి హిట్ అందుకుని తన నటన తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ఇక ఇటీవల మంచి చిత్రాల్లో నటిస్తూ మంచి పేరుతో కొనసాగుతున్న సాయి ధరమ్ తేజ్, కొద్దిరోజుల క్రితం ప్రతిరోజు పండగే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టాడు.

Image

ఇకపోతే నేడు ఆయన తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్లో ఏకంగా 2 మిలియన్ల ఫాలోవర్ల మైలు రాయిని చేరుకున్నారు. ఎప్పుడూ ట్విట్టర్ లో ఎంతో యాక్టివ్ గా ఉండే సాయి ధరమ్ తేజ్, నేడు ఈ ఫీట్ సాధించడంతో ఇది ప్రేక్షకుల, అభిమానుల దీవెనల వలన దక్కిందని, ఈ విధంగా పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా తమను అభిమానులకు మరింతగా చేరువ చేయడం ఎంతో సంతోషంగా ఉందని సాయిధరమ్ తేజ్ అంటున్నారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *