కరోనా బాధితులకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ సాయం….!!

 122 total views,  1 views today

ప్రస్తుతం దేశ దేశాలను విపరీతంగా వణికిస్తున్న మహమ్మారి కరోనా దెబ్బకు మన దేశం సహా ఇప్పటికే చాలా దేశాల్లో కొన్ని వారల పాటు లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా దీనివలన ప్రజల మధ్య సామాజిక దూరం పెరిగి కరోనా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి కాకుండా ఉంటుందని భావించి పలు దేశాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. అయితే ఈ లాకౌట్ వలన దిగువ, పేద వర్గాల ప్రజలు అయితే తినడానికి తిండి కూడా కరువైనా పరిస్థితులు ఏర్పడుతుంటాయి.

Image

కాగా అటువంటి వారి ఆకలిని తీర్చడానికి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఆర్ధిక ప్యాకెజీ ప్రకటించినప్పటికీ, మరోవైపు మేము కూడా ఈ సమయంలో ప్రజలకు అండగా ఉంటాం అంటూ పలు రంగాల ప్రముఖులు ముందుకు రావడం జరిగింది. అలానే సినిమా పరిశ్రమ నుండి ఇప్పటికే ఎందరో నటీనటులు తమ గొప్ప మనసుతో విరాళాలు అందివ్వగా, నేడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బెంగళూరు ఫ్యాన్స్ మొత్తంగా రూ.1.55 లక్షల విరాళాలు సేకరించి వాటిని కొందరికి నిత్యావరస సరుకులు అందించడంతో పాటు మరికొంత అనాధాశ్రమానికి, అలానే మాస్కులు, శానిటైజర్ల కొనుగోలుతో పాటు, మరికొంత ఒక అభిమాని మెడికల్ ట్రీట్మెంట్ కి అందించి తమ గొప్ప మనసు చాటుకున్నారు. కాగా వారిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *