కరోనా పై యుద్దానికి మెగా ఫ్యామిలీ వినూత్న ప్రచారం….!!

 175 total views,  1 views today

ప్రస్తుతం మహమ్మారి కరోనా వ్యాధి ప్రపంచ దేశాలు అన్నిటినీ కూడా ఎంతో భయకంపితులను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి మరింతగా వ్యాప్తి కాకుండా ఉండేందుకు ఇప్పటికే మన దేశాన్ని కూడా పలు ఇతర దేశాల మాదిరిగా కొన్నాళ్లపాటు లాక్ డౌన్ చేస్తున్నట్లు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది.

 

కాగా ఈ వ్యాధిని ఎవరూ కూడా తేలికగా తీసుకోవద్దని, ఎక్కడి ప్రజలు ఈ లాక్ డౌన్ సమయంలో ఎవరి ఇళ్లలోనే వారు ఉండాలని, ఏదైనా అత్యవసర కార్యం ఉంటేనే బయటకు రావాలని పలువురు అధికారులు కోరుతున్నారు. కాగా నేడు ఈ మహమ్మారి పట్ల ఎంతో జాగ్రత్త వహించాలని, ముఖ్యంగా ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని కోరుతూ ప్రజలకు మెగాఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కలిసి ఒక్కొక్కరూ ఒక్కొక్క ప్లకార్డు పట్టుకుని వినూత్నంగా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. కాసేపటి క్రితం మెగాస్టార్ దీనిని తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *