216 total views, 1 views today
మంచు వారబ్బాయి మనోజ్ హీరోగా ఆయన స్థాపించిన ఎమ్ ఎమ్ ఆర్ట్స్ బ్యానర్ తొలి వెంచర్ గా ప్రారంభం అయిన ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో విభిన్నమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మనోజ్ క్యారెక్టర్ వైవిధ్యంగా ఉండనుందని సమాచారం. ఇకపోతే నేడు కాసేపటి క్రితం ఈ సినిమా అధికారిక ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసిన మనోజ్,
తన బ్యానర్ నుండి వస్తున్న తొలి సినిమా అయిన అహం బ్రహ్మాస్మికి మీ అందరి ఆశీస్సులు కావాలంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఇక కాసేపటి క్రితం నుండి ఆ పోస్టర్ పలు మీడియా మాద్యమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎంతో వైరల్ అవుతోంది. మనోజ్ బ్రహ్మ మాదిరిగా మూడు తలల తో కూడిన ఆ పోస్టర్ రిలీజ్ తరువాత సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి అనే చెప్పాలి. కాగా ఈ సినిమాను మరొక మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం కనపడుతోంది…!!