131 total views, 1 views today
టాలీవుడ్ నటుడు విష్ణు మంచు, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో షూటింగ్స్ అన్ని బంద్ కావడంతో తన ఫ్యామిలీ తో కలిసి పూర్తిగా ఇంట్లోనే ఉంటున్నారు. ఇకపోతే ఇటీవల ఒక యూట్యూబ్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన విష్ణు తన సినిమా కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. అయితే అప్పట్లో వజ్రోత్సవాల సమయంలో మెగాస్టార్ చిరంజీవికి, విష్ణు తండ్రి మోహన్ బాబుకు మధ్య జరిగిన ఘటనను గురించి యాంకర్ అడగడంతో స్పందించిన విష్ణు, మొదటి నుండి చిరంజీవి గారు, మా నాన్న గారు మంచి మిత్రులు అనే విషయం అందరికీ తెలిసిందే.
ఏమి లేని స్థాయి నుండి నేడు వారిద్దరూ కూడా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అయితే వజ్రోత్సవాల సమయంలో చిరంజీవి గారు, నాన్నగారు మధ్య కొంత మాటల యుద్ధం జరిగినప్పటికీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు నాన్న గారిని ఉద్దేశించి తమ్ముడూ మోహన్ బాబు అని ఎందుకలా మాట్లాడారో తనకు ఇప్పటికీ కూడా అర్ధం కాలేదని, అయితే పవన్ కళ్యాణ్ గారితో కూడా తమ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉందని చెప్పారు…..!!