344 total views, 1 views today
టాలీవుడ్ నటుడు మహేష్ బాబు ఇప్పటికే ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు రూపంలో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అతి త్వరలో యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీ చేయనున్న మహేష్, ప్రస్తుతం కరోనా మహమ్మారి వలన లాక్ డౌన్ కొనసాగుతుండడంతో తన ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి ఇంట్లోనే సరదాగా గడుపుతున్నారు.
ఇకపోతే నిన్న తన ముద్దుల కూతురు సితార తో కలిసి బేర్ బాడీ తో మహేష్ బాబు దిగిన ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కూతురితో మహేష్ సరదాగా స్విమ్ చేస్తున్న ఆ ఫోటోని ఆయన సతీమణి నమ్రత తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది….!!