పూరి – మహేష్ మూవీ కన్ఫర్మ్ అయిందా…..??

 150 total views,  1 views today

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, దాని అనంతరం రామ్ ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తీయనున్నట్లు ఇటీవల వార్తలు రావడం జరిగింది. ఇక ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్, తన తదుపరి సినిమాని పరశురామ్ తో చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దాని తరువాత మహేష్ బాబు, పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేయనున్నారని, రెండు రోజుల క్రితం మహేష్ కు ఫోన్ లో పూరి ఒక అద్భుతమైన స్టోరీ ని వినిపించారని లేటెస్ట్ టాలీవుడ్ టాక్.

Puri Jagannadh Insults Mahesh Babu With This Brutal Dig, Prince ...

అయితే అది విన్న మహేష్ ఎంతో ఇంప్రెస్ అయి దాని ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పారట. పరశురామ్ సినిమా అనంతరం చేద్దాం అని మాట ఇచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, ఇదే కనుక నిజం అయితే మాత్రం, ఎప్పటినుండో సూపర్ స్టార్, పూరి కాంబినేషన్ మూవీ కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది మంచి పండుగ వార్త అనే చెప్పాలి…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *