మహేష్ బాబు వంశీ పైడిపల్లి తో కాదా…. ఆయనతోనా…. ??

 124 total views,  1 views today

సూపర్ స్టార్ మహేష్ బాబు కొద్దిరోజుల క్రితం నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. మహేష్ సరసన కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించారు. ఇక మహేష్ బాబు తదుపరి నటించబోయే సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో పలు ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో తనకు మహర్షి సినిమాని అందించిన వంశీ పైడిపల్లితో మహేష్ తన నెక్స్ట్ సినిమా చేయనున్నారని మొన్నటి వరకు వార్తలు హల్ చల్ చేసాయి. 

అయితే నేడు కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న దానిని బట్టి చూస్తే, మహేష్ నెక్స్ట్ సినిమా వంశీ తో కాకుండా, గీత గోవిందం దర్శకుడు పరశురామ్ పెట్ల తో ఉండనుందని అంటున్నారు. ఇటీవల మహేష్ ని కలిసిన పరశురామ్ మంచి ఆకట్టుకునే కథని ఆయనకు వినిపించడం జరిగిందని, అది నచ్చిన మహేష్, వెంటనే ఆ సినిమా చేద్దాం అని కమిట్ అయినట్లు టాక్. అలానే ఆ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్నట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో ఏది నిజమో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *