442 total views, 1 views today
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొద్దిరోజుల క్రితం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు తో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక దాని తరువాత మహేష్ నటించబోయే తదుపరి సినిమా విషయమై కొద్దిరోజులుగా పలు వార్తలు ప్రచారం అవుతున్నాయి. మెగాస్టార్, కొరటాల కాంబో సినిమాతో పాటు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి మహేష్ ఒప్పుకున్నట్లు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.
అయితే నేడు కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి వస్తున్న సమాచారం బట్టి చూస్తే, కొరటాల సినిమా తరువాత మహేష్ నటించబోయేది వంశీ పైడిపల్లి సినిమాలో అని, దాని తరువాతనే పరశురామ్ సినిమాని ప్రారంభిస్తారని కొందరు అంటున్నారు. ముందుగా వంశీ సినిమా స్క్రిప్ట్ పూర్తి కాకపోవడంతో సూపర్ స్టార్ దానిని ప్రక్కన పెట్టినట్లు వార్తలు వచ్చినా, రెండు రోజుల క్రితం పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసి మహేష్ ని ఒప్పించారట వంశీ. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై పూర్తి అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది…..!!