169 total views, 1 views today
ప్రస్తుతం కరోనా వ్యాధి ఎఫెక్ట్ తో మన దేశం మొత్తం కూడా కొన్ని వారాలుగా లాక్ డౌన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇటువంటి విపత్కర సమయంలో ఎందరో డాక్టర్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, కుటుంబాలను కూడా విడిచి ఎందరో కరోనా రోగులకు మంచి మనసుతో వైద్యం అందిస్తూ ప్రజల హృదయాలు గెలుచుకుంటున్నారు.
ఇకపోతే కాసేపటి క్రితం టాలీవుడ్ నటులు సూపర్ స్టార్ మహేష్ బాబు వైద్యులను ఉద్దేశించి పెట్టిన పోస్టులు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ‘ఇటువంటి కష్ట పరిస్థితుల్లో మనలో కరోనా వ్యాధి సోకినా వారికి ఎంతో దయాహృదయంతో వైద్య సేవను అందిస్తున్న ఎందరో వైద్యులకు, హెల్త్ వర్కర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, వాస్తవానికి వారికి ఏ విధంగా కృతజ్ఞత చెప్పినా తక్కువే అంటూ కాసేపటి క్రితం మహేష్ బాబు ట్వీట్స్ చేయడం జరిగింది….!!!