253 total views, 1 views today
ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ తో చాలా దేశాల్లో కొన్నాళ్లుగా లాక్ డౌన్ అమలవుతుండడంతో అన్ని రంగాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అది మాత్రమే కాక కొందరు పేద, దిగువ వర్గాలకు చెందిన ప్రజలు, దీనివలన ఆర్ధికంగా సమస్యలు ఎదుర్కొంటూ, కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం గ్రహించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి కొంత ఆర్ధిక సాయంతో పాటు రేషన్ కూడా అందిస్తున్నాయి. అయితే ప్రభుత్వంతో పాటు ఇటువంటి విపత్కర సమయంలో ప్రజలకు మేము కూడా తోడు నీడగా ఉంటాం అంటూ కొందరు ప్రముఖులు ముందుకు వచ్చి సాయం అందిస్తున్నారు.
కాగా మరోవైపు సినిమా పరిశ్రమ నుండి కూడా అనేకమంది ముందుకు వచ్చి తమకు తోచినంత విరాళాలు అందిస్తున్నారు. ఇక ఇటీవల తనవద్ద పనిచేసే కార్మికులకు తనకు వీలైనంత మొత్తంలో ఆర్ధిక సాయాన్ని అందించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజు, వారికి ఇప్పటికీ కూడా అన్నివిధాలుగా బాసటగా నిలుస్తున్నారు. ఇక నేడు కాసేపటి క్రితం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ తో మాట్లాడిన ప్రకాష్ రాజ్, తనకు ఉన్నంతలో పేదలకు సాయం అందిస్తున్నానని, వాస్తవానికి తనకు ఎవరి నుండి అడిగి తీసుకోవడం ఇష్టం లేదని అన్నారు. అయితే ఒకవేళ అవసరం అయి అడిగితే మాత్రం తన అభ్యర్ధనను ఎవరూ కాదనరాని, ఇటీవల నేను అడిగి అడగ్గానే సూపర్ స్టార్ మహేష్ బాబు, నిర్మాత అనిల్ సుంకర ఇద్దరూ కూడా కొంత మొత్తాన్ని సాయంగా అందించడం జరిగిందని ప్రకాష్ రాజ్ అన్నారు….!!