233 total views, 2 views today
ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్ డూపర్ హిట్ తో వరుసగా మూడవ విజయాన్ని అందుకుని హ్యాట్రిక్ సక్సెస్ లు కొట్టిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, అతి త్వరలో తన తదుపరి నటించబోయే 27వ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా కలిసి నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్.
ఇక ఈ సినిమాని ఎంతో గ్రాండ్ లెవెల్లో భారీ ఖర్చుతో నిర్మించనున్నట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి. ఇప్పటివరకు తన కెరీర్ లో చేయని ఒక అద్భుతమైన రోల్ ని ఈ సినిమాలో మహేష్ పోషించనున్నారని టాక్. పలువురు టాలీవుడ్ దిగ్గజ నటులు నటించనున్న ఈ సినిమాని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాలని దర్శకుడు పరశురామ్ కూడా దృఢ సంకల్పంతో ఉన్నారట. కాగా అందుతున్న సమాచారం ప్రకారం, సూపర్ స్టార్ కృష్ణ జన్మదినమైన మే 31న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు చెప్తున్నారు….!!