మహేష్ బాబు 27 వ సినిమాకు ముహూర్తం కుదిరిందా…..??

 252 total views,  1 views today

టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మొన్నటి సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న జోడి కట్టిన ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్సకత్వం వచించగా దిల్ రాజు, అనిల్ సుంకర ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

mahesh babu parashuram

ఇకపోతే ఈ సినిమా తరువాత మహేష్ నటించబోయే 27వ సినిమా గురించి ఇప్పటికే న్యూస్ బయటకు రావడం జరిగింది. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని ఈ నెల 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ప్రారంభించనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మరి ఇదే కనుక నిజం అయితే మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది మంచి పండుగ వార్త అని చెప్పాలి….!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *