70 total views, 1 views today
మాస్ మహారాజ రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ క్రాక్. యువ దర్శకడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత మధు నిర్మించగా థమన్ మ్యూజిక్ ని, జికె విష్ణు ఫోటోగ్రఫిని అందించారు. ఇకపోతే ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నిన్న ప్రేక్షకుల మధ్యకు వచ్చింది. కొన్ని కారణాల వలన సినిమా నిన్న రాత్రి సెకండ్ షో ల నుండి ఆరంభం అయినప్పటికీ ఓవరాల్ గా మూవీకి సూపర్ డూపర్ హిట్ టాక్ రావడంతో రవితేజ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కథ పరంగా చూసుకుంటే పోతురాజు వీరశంకర్ అనే ఒక ఎస్సై ఎవరైనా పవర్ అంటూ జులుం చేస్తే ఏ మాత్రం సహించడు. అయితే తన డ్యూటీలో భాగంగా మొత్తం మూడు ప్రాంతాల్లో ముగ్గురు దుండగుల ఆగడాలకు ఎదురెళ్తాడు. దాని పర్యవసానంగా అతడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆపై వారితో అతడికి ఎటువంటి గొడవలు జరిగాయి అనేది మిగతా సినిమా. ఇక ముఖ్యంగా సినిమాలో హీరో రవితేజ వండర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో పాటు మెయిన్ విలన్ గా నరించిన సముద్రఖని అనితే సూపర్బ్ గా నటించారు అని చెప్పకతప్పదు.
హీరోయిన్ శృతి హాసన్ నటనతో పాటు ఒక షాకింగ్ సీన్ తో ఫ్యాన్స్ ని ఎంతో థ్రిల్ చేస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్, రవిశంకర్ సహా దాదాపుగా సినిమాలోని నటీనటులందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు ఎంతో బాగా నటించారు. మంచి కమర్షియల్ ఎంటెర్టైనర్ గా దర్శకుడు గోపీచంద్ ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీశారు. ఫైనల్ గా చాలా సమయం తరువాత ఈ క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ కి ఆయన ఫ్యాన్స్ తో పాటు పలువురు ప్రేక్షకులు కూడా అభినందనలు తెలుపుతున్నారు. సినిమాలోని భారీ నిర్మాణ విలువలు, జికె విష్ణు కెమెరా పనితనం, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి సినిమా సక్సెస్ కు మరింత కారణాలుగా నిలిచాయి.
ప్లస్ పాయింట్స్ : –
రవితేజ నటన
థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
జికె విష్ణు ఫోటోగ్రఫి
మాస్, కమర్షియల్ అంశాలు
మైనస్ పాయింట్స్ :-
రొటీన్ గా సాగె కథనం
అంతగా ఆకట్టుకోని సాంగ్స్
కొత్తదనం ఆశించేవారికి అంతగా నచ్చదు
తీర్పు : మొత్తంగా చూసుకుంటే ఈ సంక్రాంతి పండుగ కానుకగా మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ క్రాక్ సినిమా మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్ కి మంచి విందు భోజనాన్ని అందించిందని, అలానే సాధారణ ఆడియన్స్ కూడా మూవీకి బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ కనబడుతోది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ మూవీ సూపర్ గా కలెక్షన్స్ రాబట్టి రవితేజ కెరీర్ కి మరింత ఊపునివ్వడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు…..!!
రేటింగ్ : 3.75/5