మహేష్ బాబు ఆ విధంగా అభయమిచ్చారు : కొరటాల శివ…..!!

 164 total views,  1 views today

మెగాస్టార్ చిరంజీవితో ప్రస్తుతం ఆచార్య సినిమా తీస్తున్న కొరటాల శివ, ఎలాగైనా ఆ సినిమాని హిట్ చేయాలనే తపనతో ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఆచార్య పేరుతో తెరకెక్కుతున్న ఆ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక నేడు ఒక తెలుగు పత్రికకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన కొరటాల శివ ఆచార్య గురించి కొన్ని విశేషాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే సినిమా 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుందని, లాక్ డౌన్ అనంతరం షూటింగ్ ప్రారంభించి వీలైనంత త్వరగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు కొరటాల. అయితే ఈ లాక్ డౌన్ వలన షూటింగ్ వాయిదా పడడంతో మా ఆచార్య వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయినట్లు ఇటీవల వచ్చిన వార్తలు తనకు కొంత టెన్షన్ ని తెప్పిస్తున్నాయని అన్నారు. సినిమాలో ఒక ముఖ్య పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించే అవకాశం ఉందని, ఇటీవల ఆయనకు స్టోరీ వినిపించగా ఎంతో బాగుందని చేస్తానని అన్నారని, అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉండడంతో మా సినిమాలో చరణ్ ఎంతవరకు నటిస్తారు అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుందని చెప్పారు కొరటాల.

megastar chiranjeevi acharya

కొద్దిరోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిసి తమ సినిమా గురించి మాట్లాడానని, సినిమాలో ఒక రోల్ ఉంది, అది చరణ్ చేస్తాను అన్నారు, కాకపోతే అది కుదరకపోతే కొంత కష్టం అవుతోంది సర్ అని చెప్పారట. దానికి వెంటనే స్పందించిన మహేష్, మీకు ఏమి ఇబ్బందిలేదు టెన్షన్ పడకండి, మీకు నేను ఉన్నాను, ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సాయం అయినా నేను చేస్తాను అని మహేష్ మాటిచ్చారని, అంత పెద్ద సూపర్ స్టార్ అయి ఉండి కథ వినకుండా, ఆ పాత్ర గురించి తెలుసుకోకుండా నేను సాయం చేస్తాను అంటూ మహేష్ చెప్పడం ఆయన గొప్ప గుణానికి నిదర్శనం అని, ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు కొరటాల శివ. ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారిని అందరం కలిసి తరిమికొడదాం, ఎందుకంటే సినిమాలకంటే కూడా ఈ కరోనా మన ముందు ఉన్న అతి పెద్ద సమస్య అని, కావున ప్రజలు అందరూ ప్రభుత్వానికి సహకరించి తమ తమ ఇళ్లలోనే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు కొరటాల…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *