అల్లు అర్జున్ ‘పుష్ప’ నుండి తప్పుకున్న స్టార్ నటుడు….??

 183 total views,  1 views today

ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, వెరైటీ సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపదాయంలో మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందేసితున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మెయిన్ విలన్ గా ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న విషయం తెలిసిందే.

Makkal Selvan Vijay Sethupathi likely to play the antagonist ...

అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ సినిమా నుండి హఠాత్తుగా విజయ్ తప్పుకున్నట్లు చెప్తున్నారు. దానికి ప్రధాన కారణం ప్రస్తుతం లాకౌట్ కారణంగా ఆయన కేటాయించిన డేట్స్ ముగిశాయని, అలానే లాకౌట్ అనంతరం ఆయన మిగతా ఇతర సినిమాల షూటింగ్స్ లో పాల్గొననున్నారని సమాచారం. కాగా తాను సినిమా నుండి తప్పుకుంటున్నట్లు ఇటీవల విజయ్, దర్శకుడు సుకుమార్ కి చెప్పారని, కాగా ఆయన స్థానంలో మరొక బాలీవుడ్ నటుడిని విలన్ గా తీసుకునే అవకాశం ఉందని టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, ఇది పుష్ప సినిమాకు కొంతమేర దెబ్బె అని చెప్పకతప్పదు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *