టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ వదులుకున్న కియారా అద్వానీ…..??

 157 total views,  1 views today

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ కియారా అద్వానీ. అయితే ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో తెలుగు లో కూడా కియారకు మంచి పేరు లభించింది. తొలి సినిమాతోనే తన ఆకట్టుకునే అందం, అభినయంతో కుర్రకారుని మురిపించిన కియారా, ఆ తరువాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించింది.

Kiara Advani in Bharat Ane Nenu Success Meet stills

ఇక అతి త్వరలో మహేష్ బాబు, పరశురామ్ ల కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో కియారకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని, అయితే ఆమెకు ప్రస్తుతం బాలీవుడ్ లో ఒప్పుకున్నా సినిమాల లిస్ట్ చాలానే ఉండడంతో ఇప్పట్లో కాల్షీట్స్ ఇవ్వలేను అని చెప్పిందట. దానితో ఆమె స్థానంలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ని మహేష్ ప్రక్కన జోడిగా పరశురామ్ సెలెక్ట్ చేసినట్లు చెప్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారక సమాచారం మాత్రం వెల్లడికావలసి ఉంది….!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *