‘కెజిఎఫ్ -2’ రిలీజ్ డేట్ వచ్చేసింది…. ఇక ఫ్యాన్స్ కు పండగే….!!

 132 total views,  1 views today

రాక్ స్టార్ యాష్, యువ దర్శకుడు ప్రశాంత్ నీల్ ల దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థిల్లర్ మూవీ కెజిఎఫ్ చాప్టర్ 1, రెండేళ్ల క్రితం కన్నడ సహా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. యాష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా, కీలక పాత్రల్లో పలువురు కన్నడ నటులు నటించిన ఈ సినిమాని ప్రతిష్టాత్మక హోంబేలె ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అన్ని భాషల్లోనూ అత్యద్భుత విజయాన్నిఆ అందుకున్న ఈ సినిమాకు కొనసాగింపుగా ప్రస్తుతం చాప్టర్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చాప్టర్ 1 తో పోలిస్తే ఈ సినిమాని మరింత భారీగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్నట్లు సమాచారం. 

 

దాదాపుగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఎట్టకేలకు సినిమా యూనిట్, కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 23న దసరా పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా తమ సినిమాని అత్యధిక థియేటర్స్ లో భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో చాప్టర్ 1 లో నటించిన నటులతో పాటు బాలీవుడ్ దిగ్గజ నటులైన సంజయ్ దత్ కీలక అధీరా పాత్రలోను, అలానే సీనియర్ నటి రవీనా టాండన్ ప్రధానమంత్రి రమిక సేన్ పాత్రలోనూ నటిస్తున్నారు. 

ఇక వారితో పాటు మన టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు చాప్టర్ 1 కు పనిచేసిన సాంకేతిక వర్గమే పని చేస్తోంది. వాస్తవానికి ఇటీవల కొన్ని కారణాల వలన ఈ సినిమా వాయిదా పడడంతో, అసలు ఈ ఏడాది సినిమా రిలీజ్ అవుతుందా అని కొందరు అనుమానం వ్యక్తం చేసారు, అయితే వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ నేడు అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రావడంతో ఈ సినిమా కోసం ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్న వారికి మంచి పండుగ తెచ్చింది. అతి త్వరలో ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు సినిమాలోని ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయనుందట సినిమా యూనిట్. మరి చాప్టర్ 1 మాదిరిగా ఈ సినిమా ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *