కెజిఎఫ్ – 2 కి అది భారీ దెబ్బేయనుందా…..??

 177 total views,  1 views today

కన్నడ రాక్ స్టార్ యాష్ హీరోగా హోంబలె ఫిలింస్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యక్షన్ ఎంటర్టైనర్ కెజిఎఫ్ చాప్టర్ 1 ఇటీవల రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఇక ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న కెజిఎఫ్ చాప్టర్ 2, అంతకు మించి అత్యద్భుతంగా ఎంతో బీహారేనా నిర్మాణం జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒకవార్త నిన్నటి నుండి పలు సినిమా వర్గాల్లో ప్రచారం అవుతోంది. అదేమిటంటే ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోతాడని అంటున్నారు.

KGF 2 Director Prashanth Neel Hints At A New Update On The Yash ...

అయితే ఈ విధంగా యాంటీ క్లైమాక్స్ పెట్టిన సినిమాల్లో చాలావరకు పెద్దగా సక్సెస్ కాలేదని, మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం అది నిజంగా మొత్తంగా సినిమాకు పెద్ద దెబ్బేయనుందని అంటున్నారు. కాగా కెజిఎఫ్ చాప్టర్ 2 సినిమా దసరా పండుగ కానుకగా అక్టోబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *