501 total views, 1 views today
ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్ ఇద్దరూ కూడా ఉంటారు అనే చెప్పాలి. ఇక ఒకరిని మించేలా మరొకరు వరుసగా అవకాశాలు సంపాదిస్తూ ముందుకు సాగుతున్న ఈ ఇద్దరు భామలు ప్రస్తుతం తమ సినిమా ఛాన్స్ ల విషయమై కూడా ఢీ అంటే ఢీ అనేలా దూసుకెళ్తున్నారు.
ఇక ఇటీవల దర్శకుడు తేజ ప్రకటించిన రెండు సినిమాల్లో ఒకటైన ‘అలిమేలు మంగ – వెంకటరమణ’ అనే సినిమాలో హీరోయిన్ గా మొదట కాజల్ ని తీసుకోవాలని దర్శకుడు తేజ భావించారని, అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఆమె స్థానంలోకి కీర్తి సురేష్ వచ్చినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి……!!