215 total views, 1 views today
యంగ్ హీరో నితిన్ హీరోగా ఇటీవల మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా సినిమా రంగ్ దే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇక నేడు నితిన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని కాసేపటి క్రితం నితిన్ తన సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేయడం జరిగింది. మంచి ప్లెజంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రూపొందిన ఈ మోషన్ పోస్టర్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ అందుకుంటోంది. కాగా ఈ సినిమాలో నితిన్ అర్జున్ పాత్రలో నటిస్తుండగా, కీర్తి సురేష్ అను పాత్రలో కనిపించనుంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని మే లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం కనపడుతోంది….!!