అందాల నటి కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్…..!!

 212 total views,  1 views today

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్, ఫస్ట్ సినిమాతో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోవడంతో పాటు ఆ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక రెండేళ్ల క్రితం నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన దివంగత మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి లో అత్యద్భుతమైన నటనను కనబరిచి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా గెలుచుకున్నారు.

ఇక ప్రస్తుతం నరేంద్ర నాథ్ దర్శకత్వంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ ఎస్ కోనేరు నిర్మాతగా మిస్ ఇండియా అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుండి ఎస్ ఎస్ థమన్ స్వరపరిచిన కొత్తగా కొత్త సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించింది. నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, భానుశ్రీ మెహతా, కమల్ కామరాజు, పూజిత పొన్నాడ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకుడు నరేంద్ర ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాని ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసింది….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *